ఉపేక్షా నో చేత్ కిన్న హరసి భవద్ ధ్యాన విముఖాం
దురాశా భూయిష్ఠాం విధి లిపిమశక్తో యది భవాన్ |
శిరస్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితమ్ || (15)
దురాశా భూయిష్ఠాం విధి లిపిమశక్తో యది భవాన్ |
శిరస్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితమ్ || (15)
ఉపేక్షా న చేత్ = ఉపేక్ష వహించడము కాకుంటే
కిం న హరసి = ఎందుకు హరించవు?
భవద్ ధ్యాన = నిన్ను ధ్యానించుటయందుగల
విముఖాం = విముఖతను
దురాశా భూయిష్ఠాం = దురాశా భూయిష్ఠతను
విధి లిపిం = విధాత వ్రాసిన తలరాత (మార్చుటలో)
అశక్తః = అశక్తుడవు
యది భవాన్ = నీవు అయినట్లయితే
శిరః తత్ వైధాత్రం = ఆ బ్రహ్మయొక్క శిరస్సును
న నఖలు = (సులభముగా) త్రుంచుటకు సాధ్యముకానిది
సువృత్తం = దిట్టముగానున్నదానిని
పశుపతే = ఓ పశుపతీ
కథం వా నిర్యత్నం = పెద్దగా ప్రయత్నమేమీ లేకుండగనే ఎలా
కరనఖ ముఖేన ఏవ = కేవలము నీ కొనగోటితో
లులితం = త్రుంచివేసినావు?
కిం న హరసి = ఎందుకు హరించవు?
భవద్ ధ్యాన = నిన్ను ధ్యానించుటయందుగల
విముఖాం = విముఖతను
దురాశా భూయిష్ఠాం = దురాశా భూయిష్ఠతను
విధి లిపిం = విధాత వ్రాసిన తలరాత (మార్చుటలో)
అశక్తః = అశక్తుడవు
యది భవాన్ = నీవు అయినట్లయితే
శిరః తత్ వైధాత్రం = ఆ బ్రహ్మయొక్క శిరస్సును
న నఖలు = (సులభముగా) త్రుంచుటకు సాధ్యముకానిది
సువృత్తం = దిట్టముగానున్నదానిని
పశుపతే = ఓ పశుపతీ
కథం వా నిర్యత్నం = పెద్దగా ప్రయత్నమేమీ లేకుండగనే ఎలా
కరనఖ ముఖేన ఏవ = కేవలము నీ కొనగోటితో
లులితం = త్రుంచివేసినావు?
ఓ పశుపతీ, నీవు నాపట్ల ఉపేక్ష వహించడము కాకుంటే, నా ధ్యాన విముఖతను, దురాశా భూయిష్ఠతను ఎందుకు హరించడములేదు? పోనీ ఒకవేళ బ్రహ్మదేవుడు నన్ను అలానే జీవించమని నా నుదుట వ్రాసిన రాతను మార్చడములో నీవు అశక్తుడవు అని అనుకుందామనుకుంటే, అటువంటప్పుడు, సులభముగా త్రుంచుటకు సాధ్యముకానిది, దిట్టముగానున్న ఆ బ్రహ్మయొక్క శిరస్సునే, పెద్దగా ప్రయత్నమేమీ లేకుండగనే, కేవలము నీ కొనగోటితో ఎలా త్రుంచివేసినావు?
(1) పురాణగాధ ప్రకారము, బ్రహ్మదేవునికికూడా మొదట్లో శివునివలే ఐదు తలలు ఉండేవి. ఒకసారి బ్రహ్మ తన శక్తి సామర్ద్యాల గురించి అహంకరించడంతో, బ్రహ్మయొక్క అహంకారాన్ని పోగొట్టడముకోసం, శివుడు తన కొనగోటితో బ్రహ్మయొక్క ఒక శిరస్సును త్రుంచివేసినాడు. దీనిని అధారముగా చేసుకుని, శంకరాచార్యులవారు పరమశివునితో ఈ రమణీయమైన భావాన్ని ఆవిష్కరించారు.
కొన్ని వివరణలు:
No comments:
Post a Comment