గుహాయాం గేహే వా బహిరపి వనే వాஉద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ |
సదా యస్యైవాన్తః కరణమపి శంభో తవ పదే
స్థితం చేద్యోగోஉసౌ స చ పరమయోగీ స చ సుఖీ || (12)
గుహాయాం గేహే వా = గుహలయందు లేదా గృహములయందు
బహిః అపి = లేదా ఆరుబయట ప్రదేశములయందు
వనే వా అద్రి శిఖరే = అరణ్యములయందు లేదా పర్వత శిఖరములయందు
జలే వా వహ్నౌ వా వసతు = జలమునందు లేదా అగ్నియందు వశించుచూ ఉండవచ్చుగాక
వసతేః = (అట్టి) నివాశమువలన
కిం వద ఫలం = ఏమి ప్రయోజనము సిద్ధించునో చెప్పుము
సదా = నిరంతరమూ

యస్య అన్తః కరణం అపి = ఎవని అంతఃకరణములుకూడా
శంభో = ఓ శంభో, ఆనందమును ప్రసాదించువాడా
తవ పదే స్థితం చేత్ = నీ పాదపద్మములయందే నిలచియుంటాయో
సః చ పరమ యోగీ = అట్టివాడు మాత్రమే పరమయోగి
సః చ సుఖీ = అట్టివాడు మాత్రమే సుఖమును అనుభవించుచున్నవాడు
శంభో = ఓ శంభో, ఆనందమును ప్రసాదించువాడా
తవ పదే స్థితం చేత్ = నీ పాదపద్మములయందే నిలచియుంటాయో
సః చ పరమ యోగీ = అట్టివాడు మాత్రమే పరమయోగి
సః చ సుఖీ = అట్టివాడు మాత్రమే సుఖమును అనుభవించుచున్నవాడు
మానవుడు గుహలయందు లేదా గృహములయందు, లేదా ఆరుబయట ప్రదేశములయందు, అరణ్యములయందు లేదా పర్వత శిఖరములయందు, జలమునందు లేదా అగ్నియందు ఎచటనైనా వశించుచూ ఉండవచ్చుగాక. అట్టి నివాశమువలన ఏమి ప్రయోజనము సిద్ధించునో చెప్పుము? (బాహ్య ఇంద్రియములతోపాటు) ఎవని అంతఃకరణములుకూడా నిరంతరమూ నీ పాదపద్మములయందే నిలచియుంటాయో, ఓ శంభో! అట్టివాడు మాత్రమే పరమయోగి; అట్టివాడు మాత్రమే అసలైన సుఖమును అనుభవించుచున్నవాడు.
No comments:
Post a Comment