వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి |
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి || (11)
వటుః వా గేహీ వా = బ్రహ్మచారి, లేదా గృహస్థు, లేదా
యతిః అపి జటీ వా = సన్యాసియైనా, లేదా జడలు కట్టినవాడైనా,తత్ ఇతరః నరః వా = లేదా మరొక విధముగానున్న మానవుడు అయిననూ
యః కశ్చిత్ భవతు = అతను ఎవరైననూ అగుగాక
భవ = ఓ భవా (సర్వ ప్రాణుల ఉత్పత్తికి మూలమైనవాడా)
కిం తేన భవతి = ఎవరైతేనేమి?
యది ఇయమ్ = ఒకవేళ ఈ
హృద్ పద్మం = హృదయ పద్మముగనుక
యది భవదధీనం = నీ ఆధీనమైనచో
పశుపతే = ఓ పశుపతీ!
తదియః త్వం భవసి = నీవు అతనివాడవు అగుచున్నావు
శంభో = ఓ శంభో
భవభారం చ వహసి = అతని భవ భారములన్నింటినీకూడా నీవే మోయుచున్నావు
బ్రహ్మచారి అయినా, లేదా గృహస్థు అయినా, లేదా సన్యాసిగానున్నా, లేదా జడలుకట్టిన యోగిగానున్నా, లేదా ఇవి ఏవీగాక మరొక విధముగానైనా మానవుడు ఉండి యుండవచ్చునుగాక, ఏ రీతిగా ఉంటేమాత్రమేమి? ఓ పశుపతీ! ఒకవేళ వాని హృదయ పద్మముగనుక నీ అధీనమైనచో, అతను ఎవరు అన్నదానితో సంబంధము లేకుండా, నీవే అతని వాడవై, వాని భవ భారములన్నింటినీ నీవే మోయుచున్నావు గదా!
కొన్ని వివరణలు:
(1) శివానందలహరి అంతా సమయాభావమువలన పారాయణము చేసుకోవడము కుదరనప్పుడు, నిత్య పారాయణ కోసమని, 10 అతిముఖ్య శ్లోకములను భగవాన్ శ్రీ రమణ మహర్షి
తెలిపారు. అలా భగవాన్ రమణులు ఎంపికచేసిన 10 శ్లోకములలో ఈ శ్లోకము ఒకటి.
శ్రీ రమణమహర్షి ఎంపిక చేసిన ఆ పది శ్లోకములు తెలుపకలరు.
ReplyDelete