భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ ఫలమ్
సత్వం మన్త్రముదీరయన్నిజ శరీరాగార శుధ్దిం వహన్
పుణ్యాహం ప్రకటీ కరోమి రుచిరం కల్యాణమాపాదయన్ (36)
(1) వివాహము, గృహప్రవేశము మొదలగు శుభకార్యములు చేసుకునేటప్పుడు, లేదా అమంగళములవలన మైల పడినవాటిని శుద్ధి చేసుకునేందుకు "పుణ్యాహము" అనెడి వైదిక విధిని ఆచరిస్తారు. అందులో భాగంగా, పై చిత్రములో చూపిన విధముగా, ఒక కలశ చుట్టూ పసుపు వ్రాసిన దారమును చుట్టి, ఆ కలశలో నీరుపోసి, అందులో మామిడి చిగుళ్ళను పెట్టి, ఆ పైన ఒక కొబ్బరికాయను ఉంచుతారు. అయితే ఈ శ్లోకమునందు, మన శరీరము అనెడి గృహమును శుద్ధి చేసుకోవడంకోసం ఆచరించవలసిన పుణ్యాహమునకు కావలసిన సామగ్రిగూర్చి వివరిస్తున్నారు.
భక్తః = భక్తుడు
భక్తి గుణ ఆవృతే = భక్తి అనెడి సూత్రముచే (దారముచే) ఆవృతమై (కప్పబడి)
ముద అమృత ఆపూర్ణే = సంతోషము అనెడి అమృత జలములతో నింపబడిన
ప్రసన్నే = నిర్మలమైన
మనః కుంభే = మనస్సు అనెడి కలశమునందు
సాంబ = ఓ సాంబశివా, జగన్మాతతో కూడియున్నవాడా
తవ అంఘ్రి పల్లవ యుగం = నీ పాదములు అనెడి (మామిడి) చిగుళ్ళను
సంస్థాప్య = ఉంచి
సంవిత్ ఫలమ్ = జ్ఞానము అనెడి ఫలమును (కొబ్బరికాయను)
సత్వం మన్త్రం = సత్వమును కలిగించెడు నీ మంత్రమను (ఓం నమః శివాయ)
ఉదీరయన్ = ఉచ్చరించుచు
నిజ శరీర ఆగార = నా శరీరము అనెడి గృహమును
శుధ్దిం వహన్ = శుద్ధి చేసుకొనుటకై
పుణ్యాహం = పుణ్యాహము
ప్రకటీ కరోమి = చేయుచున్నాను
రుచిరం కల్యాణం = విశేషమైన మంగళములను
ఆపాదయన్ = పొందగోరి

ఓ సాంబశివా, నీ భక్తుడనైన నేను విశేషమైన మంగళములను పొందగోరి, నా శరీరము అనెడి గృహమును శుద్ధి చేసుకొనుటకై, భక్తి అనెడి సూత్రముచే ఆవృతమై, సంతోషము అనెడి అమృత జలములతో నింపబడిన నిర్మలమైన నా మనస్సు అనెడి కలశమునందు, నీ పాదములు అనెడి మామిడి చిగుళ్ళను, మరియు జ్ఞానము అనెడి నారికేళ ఫలమును ఉంచి, సత్వమును కలిగించెడు 'ఓం నమః శివాయ' అను మంత్రమను ఉచ్చరించుచు పుణ్యాహము చేయుచున్నాను.
కొన్ని వివరణలు:
(1) వివాహము, గృహప్రవేశము మొదలగు శుభకార్యములు చేసుకునేటప్పుడు, లేదా అమంగళములవలన మైల పడినవాటిని శుద్ధి చేసుకునేందుకు "పుణ్యాహము" అనెడి వైదిక విధిని ఆచరిస్తారు. అందులో భాగంగా, పై చిత్రములో చూపిన విధముగా, ఒక కలశ చుట్టూ పసుపు వ్రాసిన దారమును చుట్టి, ఆ కలశలో నీరుపోసి, అందులో మామిడి చిగుళ్ళను పెట్టి, ఆ పైన ఒక కొబ్బరికాయను ఉంచుతారు. అయితే ఈ శ్లోకమునందు, మన శరీరము అనెడి గృహమును శుద్ధి చేసుకోవడంకోసం ఆచరించవలసిన పుణ్యాహమునకు కావలసిన సామగ్రిగూర్చి వివరిస్తున్నారు.
No comments:
Post a Comment