వస్త్రోధ్దూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గన్ధే గన్ధవహాత్మతాஉన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చేద్బాలేన్దు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో (30)

వస్త్ర ఉధ్దూత విధౌ = వస్త్రయుగ్మం సమర్పించుటకు
సహస్ర కరతా = సహస్ర కరములు కలవాడు (సూర్యుడు)
పుష్పార్చనే = పుష్పములతో అర్చించుటకు
విష్ణుతా = సర్వవ్యాపి అయిన విష్ణువును
గన్ధే గన్ధ వహాత్మతా = గంధము సమర్పించుటకు, వాసనలకు వాహకుడు (వాయువు)
అన్న పచనే = పచనముచేసిన అన్నమును సమర్పించుటకు
బర్హి ముఖ అధ్యక్షతా = అగ్నికి ప్రభువైనవాడు (ఇంద్రుడు)
పాత్రే కాఞ్చన గర్భతా = పూజించుటకై పాత్రలను సృజించుటకు, బ్రహ్మను
అస్తి మయి చేత్ = నేను అయి ఉంటే (మాత్రమే)
బాలేన్దు చూడామణే = ఓ బాలేన్దు శేఖరా
శుశ్రూషాం కరవాణి తే = నీ శుశ్రూష చేయగలను
పశుపతే = ఓ పశుపతీ
స్వామిన్ = ఓ స్వామీ
త్రిలోకీ గురో = ఓ త్రైలోక్యగురూ

ఓ బాలేన్దు శేఖరా, ఓ పశుపతీ, ఓ స్వామీ, ఓ త్రైలోక్యగురూ, నేను సహస్ర కరములు కలిగిన సూర్యుడను అయివుంటేనే నీకు వస్త్రయుగ్మమును, సర్వవ్యాపి అయిన విష్ణువును అయివుంటేనే పుష్పములను, వాయువును అయివుంటేనే గంధమును, అగ్నికి ప్రభువైన ఇంద్రుడను అయివుంటేనే పచనముచేసిన అన్నమును సమర్పించి, బ్రహ్మను అయివుంటేనే నిన్ను పూజించుటకై పాత్రలను సృజించి, అప్పుడు మాత్రమే నీ శుశ్రూష చేయగలను.
కొన్ని వివరణలు:
(1) "కరములు" అనగా "కిరణములు" అనికూడా అర్ధము ఉన్నది. సహస్ర (అసంఖ్యాక) కరములు గలవాడు సూర్య భగవానుడు.
(2) ఒకానొకప్పుడు శ్రీమహావిష్ణువు పరమశివుని సహస్ర కమలములతో అర్చింపదలచి, పూజ చేయుచున్నప్పుడు, పూజ చివరిలో ఒక కమలము తక్కువైనది. కమలాక్షుడగు శ్రీహరి, పూజకు ఆటంకము కలుగకుండా, భక్తి పరవశత్వముతో, తన కంటినే కమలమునకు బదులుగా పరమేశ్వరునికి సమర్పించుటకు ఉద్యుక్తుడవుతాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, విష్ణువును వారించి, అమితానందముతో ఆలింగనము చేసుకుని, విష్ణువునకు సుదర్శన చక్రమును అనుగ్రహిస్తాడు.
(3) ఈ శ్లోకమునందు శంకరాచార్యులవారు పరమశివుని విరాట్ స్వరూపమునుగూర్చి ప్రత్యక్షముగా చెప్పకనే, కన్నులకు కట్టినట్లు చూపిస్తారు!

No comments:
Post a Comment