కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై
ర్వసన్ శంభోరగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలిపుటః |
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః || (24)
ర్వసన్ శంభోరగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలిపుటః |
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః || (24)
కదా వా = ఎప్పుడు
కైలాసే = కైలాస శిఖరముపై
కనక మణి సౌధే = సువర్ణ మణిమయ సౌధమునందు
సహ గణైః వసన్ = ప్రమథగణ సమేతుడైయున్న
శంభోః అగ్రే = పరమేశ్వరుని ముందు
స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుటః = శిరస్సుపై జోడింపబడిన కరములతో నిలిచి
విభో = ఓ విభో, సర్వవ్యాపీ
సాంబ = ఓ సాంబశివా (అమ్మవారితో కూడియున్న శివా),
స్వామిన్ = ఓ స్వామీ
పరమశివ = ఓ పరమశివా
పాహి ఇతి నిగదన్ = పాహిమాం పాహిమాం అని స్తుతించుచూ
విధాతృణాం కల్పాన్ = బ్రహ్మ కల్పాలనుకూడా
క్షణం ఇవ = క్షణ కాలమువలే
వినేష్యామి = గడిపెదనో కదా
సుఖతః = ఆనందముతో
కైలాస శిఖరముపై, సువర్ణ మణిమయ సౌధమునందు, ప్రమథగణ సమేతుడైయున్న పరమేశ్వరుని ముందు, శిరస్సుపై జోడింపబడిన కరములతో నిలిచి, "ఓ విభో, ఓ సాంబశివా, ఓ స్వామీ, ఓ పరమశివా, పాహిమాం పాహిమాం" అని స్తుతించుచూ, బ్రహ్మ కల్పాలనుకూడా క్షణ కాలమువలే ఆనందముతో ఎప్పుడు గడిపెదనో కదా!
కొన్ని వివరణలు:
కొన్ని వివరణలు:
(1) ఈ శ్లోకమునందు మరియు రాబోయే రెండు శ్లోకములలోనూ (25,26), శంకారాచార్యులవారు మనచేత కైలాసపతి యొక్క అద్భుత దర్శనము చేయిస్తారు!
No comments:
Post a Comment