ధీయన్త్రేణ వచోఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమై
రానీతైశ్చ సదాశివస్య చరితామ్భోరాశి దివ్యామృతైః
హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః (40)
ధీ యన్త్రేణ = బుద్ధి అనెడి యంత్రముతో
వచో ఘటేన = వాక్కు అనెడి కుండలతో
కవితా = కవిత్వము అనెడి
కుల్యోపకుల్యాక్రమైః = కాలువలు పిల్లకాలువలద్వారా
ఆనీతైః చ = తీసుకురాబడిన
సదాశివస్య = సదాశివునియొక్క
చరిత = చరితము అనెడి
అమ్భో రాశి దివ్య అమృతైః = దివ్యామృత జల రాశులు
హృత్కేదార = హృదయము అనెడి పంటభూమితో
యుతాః చ = కలిసినప్పుడు
భక్తి కలమాః = భక్తి అనెడి పంట
సాఫల్యమ్ ఆతన్వతే = సాఫల్యమును పొందుతుంది
దుర్భిక్షాత్ = దుర్భిక్షమువలన
మమ = నాకు
సేవకస్య = (నీ) సేవకునకు
భగవన్ = హే భగవాన్
విశ్వేశ = హే జగత్ప్రభో
భీతిః కుతః = భయము ఎక్కడ ఉన్నది?
బుద్ధి అనెడి యంత్రముతో, వాక్కు అనెడి కుండలతో, కవిత్వము అనెడి కాలువలు పిల్లకాలువలద్వారా తీసుకురాబడిన సదాశివునియొక్క చరితము అనెడి దివ్యామృత జల రాశులు, హృదయము అనెడి పంటభూమితో కలిసినప్పుడు, హృదయమునందలి భక్తి అనెడి పంట సాఫల్యమును పొందుతుంది. హే భగవాన్, హే జగత్ప్రభో, నీ సేవకుడనగు నాకు ఇక దుర్భిక్షమువలన భయము ఎక్కడ ఉన్నది?
కొన్ని వివరణలు:
(1) పంట పొలాలకు నీరు పెట్టడానికి ఉపయోగించే ఒక విధానములో, ఒక యంత్రానికి బానను (బకెట్) ఒకదానిని అమరుస్తారు. ఆ యంత్రాన్ని త్రిప్పినప్పుడు, పెద్దకాలువలలోనుండి నీరు, ఈ బానద్వారా చేనుకు దగ్గరగా తీసుకుని రాబడుతుంది. దీనిని "ఏతము" అని అంటారు. ఆక్కడినుండి ఆ నీరు పిల్లకాలువలద్వారా పంట పొలాలలోకి మళ్ళింపబడుతుంది. దీనిని ఉపమానముగా తీసుకుని, భక్తుని హృదయము అనే పంటభూమిలోనికి భగవంతుని చరితామృతము అనెడి దివ్య జలాలను ఎలా తీసుకు రావాలో, అలా తీసుకు రాబడిన జలాలు ఆ భూమిలోని భక్తి అనెడి పంటతో కలిసినపుడు ఏమి జరుగుతుందో ఈ శ్లోకములో హృద్యముగా వివరించారు.