ఆనన్దామృత పూరితా హరపదాంభోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా
ఉచ్ఛైర్మానస కాయమాన పటలీమాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా (49)
ఆనన్ద అమృత = ఆనందము అనెడి అమృతముతో
పూరితా = నింపబడి
హర పదాంభోజ = శివుని పాదపద్మములు అనెడి
ఆలవాల ఉద్యతా = పందిరి రాటపై (ప్రాకుడు కర్రపై) ఎగబ్రాకి
స్థైర్య ఉపఘ్నం ఉపేత్య = స్థైర్యము (అనెడి పందిరిపై గల కర్రల)ను ఆధారముగా చేసుకుని
భక్తి లతికా = భక్తి అనెడి లత
శాఖ ఉపశాఖ అన్వితా = చిలవలు పలవలను అల్లుకొనుచు
ఉచ్ఛైః మానస = ఉన్నతమైన మనస్సు అను
కాయమాన పటలీం = పందిళ్ళ సమూహమును
ఆక్రమ్య = ఆవరించుకొని
నిష్కల్మషా = (చీడ మొదలగు వానిచే) శిధిలముగాక
నిత్య అభీష్ట ఫల ప్రదా = శాశ్వతమైన కోర్కెను తీర్చున్నది (మోక్షము అను ఫలమును ఇచ్చునది)
భవతు మే = నాకు అగుగాక
సత్కర్మ సంవర్ధితా = పుణ్య కర్మలచే వృద్ధి పొందుచు

భక్తి అనెడి లత - ఆనందము అనెడి అమృతమయ జలములతో పోషింపబడి, శివుని పాదపద్మములు అనెడి పందిరి రాటపైనుండి ఎగబ్రాకి, స్థైర్యము అనెడి పందిరిపై గల కర్రలను ఆధారముగా చేసుకుని, చిలవలు పలవలను అల్లుకొనుచు, ఉన్నతమైన మనస్సు అను పందిళ్ళ సమూహమును ఆవరించుకొని, చీడ మొదలగు వానిచే శిధిలముగాక, పుణ్య కర్మలచే వృద్ధి పొందుచు, నా మనోభీష్టమగు శాశ్వతమైన మోక్షము అను ఫలమును ఇచ్చుగాక.
కొన్ని వివరణలు:
(1) ఈ శ్లోకమునందు "శివునిపై గల భక్తి వృద్ధి చెంది మోక్ష ఫలమును ఇచ్చుట" - "లత పెరిగి ఫలములనిచ్చుట" తో పోల్చబడినది. పాదునుండి బయలుదేరిన లత, నీటితో పోషింపడి, పందిరియొక్క రాటలను ఆధారంగా చేసుకుని పందిరిపైకి ఎగబ్రాకి, శాఖోపశాఖలుగా విస్తరించి, చీడ పీడల వలన శిధిలమవకుండా, వృద్ధిని పొందినప్పుడు, ఆ లత మధురమైన ఫలములను ఇస్తుంది; అదేవిధంగా "శివభక్తి" అనే లత, మనము ఏమి ఆచరిస్తే, "మోక్షము" అనే శాశ్వత ఫలాని మనకు ప్రసాదిస్తుందో ఈ శ్లోకంలో శ్రీ శంకరాచార్యులవారు వర్ణించారు.